: వాహనచోరుల కేరాఫ్ అడ్రస్ దేశ రాజధాని


వాహనచోరుల కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది దేశ రాజధాని. ఢిల్లీలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడేవారితో ఢిల్లీ కిటకిటలాడుతుంది. ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లను నమ్మలేక ప్రజలంతా సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో, మెట్రోనగరమైన ఢిల్లీలో ప్రతి గంటకు మూడు వాహనాలను దొంగలు తస్కరిస్తున్నారని రికార్డులు చెబుతున్నాయి. అలాగే ప్రతి గంటకు ఒక మొబైల్ ఫోన్ కూడా దొంగిలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

జనవరి 1 నుంచి జూన్ 20 వరకు జరిగిన దొంగతనాల వివరాలు వెల్లడించిన సందర్భంగా పోలీసులు ఈ విషయాలు తెలిపారు. జనవరి 1 నుంచి నేటి వరకు 13,976 వాహనాలు దొంగతనానికి గురవ్వగా, 5,590 మెబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News