: రుణమాఫీపై ఆర్ బీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: కుటుంబరావు


ఆంధ్రప్రదేశ్ రైతుల రుణమాఫీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆరోపించారు. కోటయ్య కమిటీ తరఫున ఆర్ బీఐకి లేఖ రాశామని, అయితే వారి నుంచి స్పందన కరవైందని తెలిపారు. ఆయన నేడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఖరీఫ్ రుణాల రీషెడ్యూల్ పై ఆర్ బీఐని, కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో ఆర్ బీఐ అధికారులను కలుస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News