: తెలంగాణ క్రీడాసంఘాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల హవా
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణలో క్రీడా సంఘాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కాగా, తెలంగాణ క్రీడా సంఘాల్లో కేసీఆర్ కుటుంబీకుల హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ తనయ కవిత ఎన్నిక కాగా, తాజాగా, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ ఎన్నికయ్యారు. ఈ సంఘానికి కార్యదర్శిగా జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యవహరిస్తారు.