: దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలు కల్పించరాదు: స్వరూపానంద
హైందవ దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలు కల్పించరాదని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో నిర్వహించిన అక్షర దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఇస్లామిక్ యూనివర్శిటీని స్వాధీనం చేసుకోవాలని కోరారు. పెరిగిన రైలు చార్జీలు భక్తులకు భారంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.