: గవర్నర్లను మార్చడం సహజమే: వెంకయ్యనాయుడు
రాష్ట్రాల గవర్నర్ల నియామకం రాజకీయపరమైనదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థ మారినప్పుడు గవర్నర్లు మారుతుంటారని అన్నారు. బీజేపీ కఠిన నిర్ణయాలు దారితప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చి నిండా నెలరోజులు కాలేదన్న ఆయన, ఈ నిర్ణయాలు ఏ ప్రభుత్వ పాలన కారణంగా తీసుకున్నవో ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.