: హీరోనై నాన్న కోరిక తీర్చా... దర్శకుడినై అన్నయ్య పేరు నిలబెడతా: సాయిరామ్ శంకర్


నాన్న కోరిక మేరకు సినిమా హీరోనయ్యానని యువ కథానాయకుడు సాయిరామ్ శంకర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని పసలపూడిలో ఆయన మాట్లాడుతూ, మంచి కథ సిద్ధం చేసుకుని దర్శకత్వం వహించి అన్నయ్య పూరి జగన్నాథ్ లా పేరు తెచ్చుకోవాలని ఉందని అన్నారు. పెదపూడిలో జరిగిన గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి, లలితాదేవి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాల్లో సాయిరామ్ పాల్గొన్నారు. జి.మామిడాడకు చెందిన తన క్లాస్ మేట్, స్నేహితుడు బ్రహ్మశ్రీ వీరవల్లి సత్యశ్రీ లలితా భాగ్యదత్ (పెదబాబు సిద్ధాంతి) ఆహ్వానంపై వచ్చానని ఆయన వెల్లడించారు. తన సినిమాల్లో 'బంపర్ ఆఫర్' అంటే చాలా ఇష్టమని తెలిపారు.

  • Loading...

More Telugu News