: ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 'ఇందిరమ్మ కలలు' కార్యక్రమంలో భాగంగా సీఎం ఈ పర్యటన చేపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లిన కిరణ్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలానికి చేరుకున్నారు. ముందుగా ఇక్కడి చిన్న గోపాల్ పూర్ గ్రామంలో గిరిజనులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కళాశాల ఆవరణలో అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన చేస్తారు. తర్వాత పలు కార్యక్రమాల్లో కిరణ్ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.