: రేపు పోలీసుల ఎదుట వాంగ్మూలమివ్వనున్న ప్రీతీ జింతా
నెస్ వాడియాతో వివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రీతీ జింతా రేపు పోలీసుల ఎదుట వాంగ్మూలమివ్వనున్నారు. ఆమె నేడు అమెరికా నుంచి భారత్ చేరుకుంటారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ఉన్న తనను నెస్ వాడియా తీవ్రంగా దుర్భాషలాడాడని ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నామని ముంబయి సీపీ రాకేశ్ మారియా తెలిపారు.