: బెజవాడలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉమ
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు విజయవాడలో నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. నీటిపారుదల శాఖ సమీక్షలన్నీ విజయవాడలో నిర్వహిస్తామని, సదరు మంత్రిత్వశాఖ ఇక్కడి నుంచే పనిచేస్తుందని ఉమ ఇంతకుముందే ప్రకటించారు. అధికారులంతా విజయవాడ రావాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు కూడా. ఈ క్రమంలో ఆయన నూతన కార్యాలయం ప్రారంభించి బాధ్యతలు చేపట్టారు.