: బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పలువురు నేడు బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రిగా చినరాజప్ప, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పీతల సుజాత, దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి కొన్ని ముఖ్యమైన ఫైళ్ళపై సంతకాలు చేశారు. వీరితో పాటు సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిగా 'ఎన్టీఆర్ సుజల స్రవంతి' ఫైల్ పై సంతకం చేశారు. ఇక, ప్రకాశం జిల్లాకు చెందిన శిద్ధా రాఘవరావు రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.