: సోనియాతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌవాన్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చనున్నారనే ఊహాగానాలు, శరద్ పవార్ వ్యాఖ్యల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ ముగిసిన అనంతరం చవాన్ మాట్లాడుతూ, టీవీల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం, ఇతర అంశాలను అధినేత్రికి వివరించానని ఆయన తెలిపారు.