: రైల్వే ఛార్జీల పెంపు కఠినమే... కానీ సరైన నిర్ణయమే!: అరుణ్ జైట్లీ
రైల్వే ఛార్జీల పెంపు కఠిన నిర్ణయమైనా సరైన నిర్ణయమేనని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా రైల్వే శాఖ నష్టాల్లో కొనసాగుతోందని అన్నారు. రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్న జైట్లీ... ప్రపంచ శ్రేణి రైల్వే వ్యవస్థ కావాలో, వద్దో, తేల్చుకోవాల్సింది ప్రజలేనని అన్నారు.