: కామాంధుడు... 300 మంది మహిళలను వేధించాడు


ముంబైలో పోలీసులు అభిరామ్ అతుల్కర్ (53) అనే స్త్రీలోలుడిని అరెస్టు చేశారు. లాయర్, డాక్టర్, యాక్టర్, కౌన్సిలర్, టీచర్, నర్స్, స్టూడెంట్... ఇలా ఎవరైనా అభిరామ్ కంటబడితే చాలు, ఆమెకు వేధింపులు మొదలయ్యేవి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 300 మంది మహిళల్ని అభిరామ్ అతుల్కర్ వేధించాడని పోలీసులు వెల్లడించారు. మూడు నెలల క్రితం పయ్ అలీబాగ్ మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు నమితా నాయక్ కి ఓ అసభ్య మెసేజ్ వచ్చింది.

దీనిని ఏవరో ఆకతాయి పనిగా తీసిపారేసిన ఆమె, తరువాత వరుసగా మెసేజ్ లు వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ యవ్వారంపై కూపీలాగారు. దీంతో అతని బండారం బట్టబయలైంది. అభిరామ్ కొంత మందికి లేఖలు కూడా రాసేవాడని పోలీసులు వెల్లడించారు. అయితే అతని నిర్వాకంపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఇలాంటి వారి ఆటకట్టించాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నమితా నాయక్ తెలిపారు.

  • Loading...

More Telugu News