: లాసెట్ ఫలితాల విడుదల


లాసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఫలితాలు విడుదలైనట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోని విద్యావ్యవస్థలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తాయని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు మానవ వనరుల శాఖ కిందకు వస్తాయని తెలిపారు. తిరుపతికి ఐఐటీ, సెంట్రల్ వర్శిటీ, ఐటీఐఆర్ కూడా వస్తాయని మంత్రి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News