: చంద్రబాబు హామీపై కరుణానిధి అభ్యంతరం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని పాపాగ్ని నదిపై డ్యాం కట్టితీరుతామని హామీ ఇవ్వడాన్ని తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తప్పుబట్టారు. డ్యాం నిర్మాణం జరిగితే తమిళనాడులోని మూడు జిల్లాలకు తాగునీటికి సమస్య ఏర్పడుతుందని చెప్పారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వేలూరు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాల ప్రజలు తాగునీటి అవసరాలన్నీ పాపాగ్ని నీటిపై ఆధారపడి ఉన్నాయని వివరించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇదే ప్రతిపాదన చేశారని... అయితే, యూపీఏ మిత్రపక్షాలు వ్యతిరేకించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారని కరుణ వెల్లడించారు.

  • Loading...

More Telugu News