: బాలికపై పూజారి అత్యాచారం, హత్య
ప్రసాదం ఇస్తానని చెప్పి అభం శుభం ఎరుగని చిన్నారిపై ఓ పూజారి అత్యాచారానికి తెగబడి, ఆపై హత్య చేసిన సంఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది. బర్ద్వాన్ జిల్లా ఆందల్ లో జరిగిందీ దారుణం. రెండవ తరగతి చదువుతున్న బాలిక పూలు కోసుకోవడానికి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఇది గమనించిన ఆ కాముక పూజారి ప్రసాదం ఆశచూపి ఆలయం పై అంతస్తులోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలికను గొంతు నులిమి చంపేసి, కిందికి నెట్టివేశాడు. పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు అక్కడికి వచ్చి చూడగా, బాలిక మృతదేహం కనిపించింది. ఒంటిపై తీవ్రగాయాలున్నాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పూజారిని అదుపులోకి తీసుకున్నారు.