: కామెడీ చేసిచేసి విసిగిపోయా...డైరెక్టరవుతా: బాలీవుడ్ హీరో
కామెడీ చేసిచేసి విసిగిపోయానని, త్వరలోనే దర్శకత్వం వహిస్తానని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ప్రకటించాడు. హమ్ షకల్స్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముంబైలో ఆయన మాట్లాడుతూ, సినిమా తీయడం అద్భుతమైన కళ అని, దర్శకత్వం, నిర్మాణం రెండూ తనకు అత్యంత ఇష్టమైన విషయాలని అన్నాడు. 'నిర్మాణం మనదైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకుంటాం' అన్నాడు. అదే దర్శకుడైతే కేవలం సృజనాత్మకత చూసుకుంటే చాలని రితేష్ తెలిపాడు. జెనీలియాను పెళ్లి చేసుకున్న రితేష్ దేశ్ ముఖ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు.