: 'మూత్రశాల'కు మంత్రిగారి పేరు!
మహారాష్ట్రలో డ్యాముల్లో మూత్రం పోయాలా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తాజాగా జల్నా అనే ప్రాంతంలో ఓ యూరినల్ కేంద్రానికి అజిత్ పవార్ పేరు పెట్టారు. స్థానిక సామాజిక కార్యకర్తలు ఈ రీతిలో కొత్తగా నిరసన వెలిబుచ్చారు. ప్రజలు నీటిసమస్యకోసం ఉద్యమిస్తూంటే.. డ్యాముల్లో మూత్రం పోయాలా? అన్నందుకు ఆయనకు ఇది వెరైటీ నిరసన. ఇప్పటికే ఆయన మీద అభిశంసన తీర్మానం వంటి సీరియస్ నిరసనలు ఇంకా బోలెడు ఉన్నాయి.