: 37 ఏళ్లుగా స్టార్ హోటల్ లోనే ఉంటూ... మరణించిన వ్యాపారవేత్త!


మూడు దశాబ్దాలకుపైగా స్టార్ హోటల్ లోనే ఉంటున్న 81 ఏళ్ల వ్యాపారవేత్త మృతి చెందాడు. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో విలాసవంతమైన సూట్ లో 37 ఏళ్లుగా ఉంటున్న బల్సారా అనారోగ్యం కారణంగా మ్యాక్స్ ఆసుపత్రిలో మరణించారు. 2009లోనే బల్సారా భార్య మరణించింది. వారికి పిల్లలు లేరు. బల్సారాకి ఇద్దరు సోదరులున్నారు. సింగపూర్ కి చెందిన ప్రవాస భారతీయుడైన బల్సారా 1991లో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ఉత్పత్తి చేసే మినరల్ వాటర్ కు హిమాలయన్ అనే పేరు పెట్టాడు.

తాజ్ మాన్ సింగ్ హోటల్ లో 901 నెంబర్ గల విలాసవంతమైన సూట్ లో కాలం గడిపేవాడు. చాలా సంవత్సరాలుగా హోటల్ లో ఉంటున్నందున తాజ్ మాన్ సింగ్ హోటల్ యాజమాన్యం అతనికి అద్దె తగ్గించాలని నిర్ణయించింది. దీంతో నెలకు నాలుగున్నర లక్షలు చెల్లించేలా ఆయనతో ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన ఆయన ఉండే సూట్ కు రోజుకు 15 వేలు అద్దె చెల్లించేలా నిర్ణయించింది. అలా మూడు దశాబ్దాలకు పైగా ఆయన హోటల్ లోనే ఉన్నారు.

గురువారం తెల్లవారు జామున ఆయన గుండెపోటులో మృతి చెందారు. ఆయన బ్యాంకు ఖాతాలో 250 కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో కొంత మొత్తాన్ని ఆయన బంధువులకు, మరికొంత మొత్తాన్ని విరాళాల రూపంలో పేదలకు అందజేయనున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News