: కోహ్లీ కిందికి... ఏబీ పైకి...!
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రపీఠం కోల్పోయాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల జాబితాలో కోహ్లీ ఓ స్థానం దిగజారి రెండో ర్యాంకులో నిలిచాడు. సఫారీ వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ టాప్ కి ఎగబాకాడు. ఏబీ అటు టెస్టుల్లోనూ నెంబర్ వన్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. కాగా, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారి పదోస్థానానికి పడిపోయాడు. ధోనీ ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు.