: పేరు మార్చి సొమ్ము చేసుకుంటున్నారు... 'నమో' బామ్, 'నమో' పెయిన్ కిల్లర్


వినియోగదారుల బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో వ్యాపారులను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. హర్యానాలోని ఓ ఔషధాల తయారీ కంపెనీ ఇందులో రెండాకులు ఎక్కువే చదివింది. నరేంద్ర మోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసిన సదరు ఔషధ కంపెనీ 'నిముసిలైడ్' అనే నొప్పి నివారణ మందుకు 'నమో' అని పేరు మార్చి ఓ బామ్, జెల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతే, అంతవరకు అంతంత మాత్రంగానే ఉన్న అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. మోడీ అంటే మోజున్న జనాలంతా అదే మందు వాడుతున్నారని, వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని ఆ ఔషధ కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

  • Loading...

More Telugu News