: సైనా... చైనా 'గోడ'ను అధిగమించలేకపోయింది
భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోమారు చైనా షట్లర్లకు తలవంచింది. ఇండోనేసియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో సైనా ప్రస్థానం క్వార్టర్ ఫైనల్ వద్దే ముగిసింది. చైనా క్రీడాకారిణి లీ ఝురితో పోరులో సైనా 20-22, 15-21తో పరాజయం పాలైంది. తొలి గేమ్ లో పోరాటపటిమ కనబర్చిన సైనా రెండో గేమ్ లో చేతులెత్తేసింది. ప్రత్యర్థి పవర్ గేమ్ కు దాసోహమంది.