: బాలీవుడ్ లో దున్నేస్తున్న మురుగదాస్ సినిమా
బాలీవుడ్ 'ఖిలాడీ' అక్షయ్ కుమార్ తో దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం 'హాలిడే'. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పుడే వంద కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన అన్ని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం అక్షయ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుందని బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో అక్షయ్ సరసన సోనాక్షి సిన్హా కథానాయికగా నటించింది. ఈ చిత్ర నిర్మాణంలో అక్షయ్ కూడా పాలుపంచుకోవడం విశేషం.