: టీడీపీ హామీలనే గవర్నర్ ప్రస్తావించారు: రవీంద్రనాథ్ రెడ్డి
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పెదవి విరిచారు. ప్రసంగంలో రాయలసీమ గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే, రాజధాని ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వలేదని అన్నారు. టీడీపీ హామీలనే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారని ఎద్దేవాచేశారు. గవర్నర్ ప్రసంగం తమను అసంతృప్తికి గురిచేసిందని అన్నారు.