: ప్లాస్టిక్‌ ఎఫెక్ట్ : గర్భంలో ఉండగానే కేన్సర్‌ రావచ్చు


ప్లాస్టిక్‌ అనే పదార్థం మానవ జీవితాలకు చాలా రకాలుగా హానికారకం అని తెలియజెప్పే అధ్యయనాలు ఇప్పటికే ఎన్నో వెలుగుచూశాయి. కేవలం మట్టిగా మారి మట్టిలో కలవడానికి మనం వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచి.. కొన్ని లక్షల సంవత్సరాల సమయం తీసుకుంటుందనే భయంతోనే మనం ప్లాస్టిక్‌ సంచుల వాడకం కూడా నిషేధించాం. ఇలాంటి నేపథ్యంలో ప్లాస్టిక్‌ గురించి మరో భయంకరమైన వాస్తవం ఇది. కేవలం మనకే కాదు.. గర్భంలో ఉండే శిశువుకు కూడా కేన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాల్ని అంటించగల శక్తి ఈ ప్లాస్టిక్‌కు ఉంటుందిట.

ప్లాస్టిక్‌ తయారీలో ఉపయోగించే బైస్ఫెనాల్‌ ఏ (బీపీఏ) అనే రసాయనం ఇలాంటి దుష్ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల శిశువు జన్మించిన తర్వాత రొమ్ముకేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉందని ఫ్రాన్స్‌లోని ఏన్సెస్‌ సంస్థ హెచ్చరించింది. ప్లాస్టిక్‌ పాల, నీళ్ల సీసాలు, ఆహార డబ్బాల వలన మెదడు, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, స్థూలకాయం సమస్యలున్నట్లు కొన్ని అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. ఇప్పుడు ఇదొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంతో ఉన్నవారు ప్లాస్టిక్‌ డబ్బాల్లోని ఆహారం వాడొద్దంటూ ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఏన్సెస్‌ వారి అధ్యయనం తర్వాత ఫ్రాన్స్‌ పిల్లల ఆహార ఉత్పత్తులకు వాడే ప్లాస్టిక్‌ తయారీలో బీపీఏ వాడకాన్ని నిషేధించింది. యూరోప్‌ దేశాలు అనేకం ఇదే నిబంధన పాటిస్తున్నాయి.

  • Loading...

More Telugu News