: ధరలు తగ్గిస్తామన్నారు... అప్పుడే పెంచడం మొదలుపెట్టారు: ఎన్డీయేపై పొన్నాల ధ్వజం
రైల్వే ఛార్జీలను పెంచడంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ధరలను తగ్గిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఎన్డీయే... అప్పుడే పెంచడం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రజలపై ఛార్జీల మోత మోగించడం మోడీ సర్కారుకే చెల్లిందని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే... ఎవరినీ కనీసం సంప్రదించకుండానే ఛార్జీలను పెంచేశారని ఆరోపించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఎన్డీయే ప్రభుత్వ వైఖరి బయటపడిందని అన్నారు.