: ఏపీ సెట్ లో అర్హత మార్కుల తగ్గింపు
ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్) కు సంబంధించిన అనుబంధ ఫలితాలను వెల్లడించింది. గత ఏడాది జరిగిన సెట్ లో ఉత్తీర్ణత శాతం మార్కులను తగ్గించి ఫలితాలను విడుదల చేశారు. తాజా జాబితా వల్ల ఈ పరీక్షలో మరో 3066మంది అర్హత సాధించారు.
భౌతిక శాస్త్రం, ఆంగ్లం వంటి సబ్జెక్టుల్లో తక్కువ మంది అర్హత సాధించడంతో యూజీసీ అనుమతితో ఉత్తీర్ణత శాతం తగ్గించారు. తాజాగా అర్హత సాధించిన వారికి త్వరలోనే సర్టిఫికేట్లు అందజేస్తామని ఏపీ సెట్ కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.