: 'ఏపీకి రాజధాని కూడా లేదు': గవర్నర్
ప్రస్తుతం ఏపీకి రాజధాని కూడా లేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రధాన ఆస్తులను కోల్పోయిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఎక్కువ సంస్థలు తెలంగాణకే చెందాయని వివరించారు. రాజధాని ఏర్పాటుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని గవర్నర్ కోరారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయాన్ని అనుకూలంగా మలుచుకుని ముందుకుసాగాలని సూచించారు.