: తార స్థాయికి చేరిన పీపీఏ వివాదం...!


విద్యుత్ కొనుగోలు ఒప్పందం తార స్థాయికి చేరింది. పీపీఎల రద్దు నిర్ణయం గొడవపై సమగ్ర నివేదిక అందజేయాలని గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో పీపీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు అందజేసింది. పీపీఏలను రద్దు చేయడంతో కన్నెర్ర చేసిన కేసీఆర్ గత పదేళ్లలో జరిగిన భూ కేటాయింపులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గత పదేళ్లలో జరిగిన భూ కేటాయింపులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల పేరుతో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో జరిగిన భూపందేరాన్ని వివరంగా అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు.

పరిశ్రమల పేరుతో గత పదేళ్లలో జరిగిన భూకేటాయింపుల వివరాలు అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, ఫార్మా కంపెనీలకు గత పదేళ్లలో కేటాయించిన భూమలు వెనక్కి తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. పారిశ్రామిక భూకేటాయింపులపై పక్కా పాలసీని తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News