: టీనేజర్లను బొద్దుగాచేసే టీవీ పిచ్చి!
అదేపనిగా టీవీముదు కూచోవడం యువతరం బలిసిపోవడానికి కారణం అవుతోందిట. బలిసిపోవడం అంటే సరైన మీనింగే తీసుకోవాలి. ఎందుకంటే అదేపనిగా టీవీ ముందు కూర్చుని చూస్తూ గడిపేసే కుర్రకారులో ఒబేసిటీ (స్థూలకాయం) సమస్య అధికంగా ఉన్నట్లు బోస్టన్ పిల్లల ఆస్పత్రికి చెందిన డాక్టర్లు డేవిడ్ బిక్‌హం బృందం తమ పరిశోధనల్లో తేల్చింది. వీరు తమ పరిశోధనకు 13`15 ఏళ్ల మధ్యన ఉండే కుర్రకారును ఎంచుకున్నారు. రెండు రకాల కోణాల్లోంచి అధ్యయనం సాగించారు. టీవీ చూడడం వల్ల ఫలితాలు.. అలాగే, కంప్యూటర్ గేములు/ వీడియో గేముల వల్ల ఫలితాలు ఇలా విడివిడిగా స్టడీ చేయదలచుకున్నారు. ఆ పిల్లల ఎత్తు : బరువు పోల్చిచూసారు.
తమాషా ఏంటంటే.. కంప్యూటర్, వీడియోగేమ్స్ ఆడుకుంటూ గడపడంలో ప్రమాదం ఏమీ వారికి కనిపించలేదు. ఆ సమయంలో చేతుల్తో పనిచేస్తూ ఉండడం, ఆ ధ్యాసలో పడిపోయి.. తిండి తక్కువగా తింటుండడం వల్ల పిల్లలు మితంగానే ఉన్నారు. అయితే వేరే పనిలేకుండా కేవలం టీవీచూస్తూ గంటలు గంటలు గడిపేసే వారు మాత్రం.. స్థూలకాయులుగా మారుతున్నారు. టీవీ చూసే సమయంలో అదేపనిగా తింటూ గడపడం కూడా వీరు స్థూలకాయులుగా మారడానికి మరో కారణం అవుతోంది.