: మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేదు: కామినేని శ్రీనివాస్
ఈ ఏడాది మెడికల్ కళాశాల్లో ఫీజులు పెంచేది లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతేడాది ఫీజులే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నామని అన్నారు. ఎంబీబీఎస్ ఫీజులపై వచ్చే నెల మొదటి వారంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా కోల్పోయిన 350 సీట్లను తిరిగి సాధించుకుంటామని తెలిపారు. దీనిపై కేంద్రం ద్వారా కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
కాగా, ఎంసీఐ కేటాయించిన 450 సీట్లలో 150 సీట్లను పద్మావతి మహిళా యూనివర్సిటీ వైద్య కళాశాలకు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన సీట్లను ఇతర కళాశాలలకు కేటాయించారని ఆయన తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ లో గత ఏడాది చేపట్టిన విధానాన్నే అవలంభించనున్నామని కామినేని చెప్పారు.