: నామినేషన్ వేసేందుకు హైదరాబాద్ చేరుకున్న నిర్మలా సీతారామన్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసేందుకే ఇక్కడకు వచ్చానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి మృతితో ఏపీలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో, నిర్మలా సీతారామన్ ను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. నిర్మల అభ్యర్థిత్వానికి ఏపీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న టీడీపీ మద్దతు ప్రకటించింది. రేపు (శనివారం) నిర్మల నామినేషన్ వేస్తారు.