: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న 'బాహుబలి' వర్కౌట్ వీడియో


వందకోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రంపై ప్రజల్లో ఆసక్తి తగ్గనీయకుండా చేయడంలో రాజమౌళి ఇప్పటివరకు సక్సెస్ అయినట్టే. 'బాహుబలి' షూటింగ్ కు సంబంధించిన విశేషాలను క్రమం తప్పకుండా వీడియోల రూపంలో అభిమానుల ముందుకు తెస్తున్నాడీ టాప్ డైరక్టర్. తాజాగా, ఆ సినిమాలో నటిస్తున్న తారాగణంతో వర్కౌట్లు చేయిస్తున్న వీడియోను విడుదల చేశాడు. నిన్న నెట్టింట్లో అడుగుపెట్టిన ఆ వీడియో యూట్యూబ్ లో వేల హిట్స్ సొంతం చేసుకుంది. ఫేస్ బుక్ లో వెయ్యిమందికి పైగా షేర్ చేసుకున్నారట. హీరో ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు ఈ వీడియోలో కనువిందు చేశారు.

  • Loading...

More Telugu News