: సహజీవనం చేసి వదిలేశాడు..! బాయ్ ఫ్రెండ్ పై టీవీ యాంకర్ ఫిర్యాదు


ఆమె హైదరాబాదులోని ఓ టీవీ చానల్లో యాంకర్ గా వ్యవహరిస్తోంది. పేరు అనుశ్రీ. అర్జున్ అనే యువకుడితో కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్న ఈ యువతి ఇప్పుడా యువకుడిపైనే ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే... అనుశ్రీ ఎస్.ఆర్.నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. అర్జున్ తో ఏర్పడిన పరిచయం సహజీవనం దాకా వెళ్ళింది. పెళ్ళి చేసుకుంటానని ఇచ్చిన మాటను తుంగలో తొక్కి అర్జున్ జెండా ఎత్తేశాడు. దీంతో, అనుశ్రీ హతాశురాలైంది. వెంటనే ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు విశాఖపట్నంలో శనివారం మరో యువతిని వివాహం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

  • Loading...

More Telugu News