: ఇరాక్ లో కిడ్నాపైన భారతీయులు సురక్షితం: సుష్మా స్వరాజ్


ఇరాక్ లో అపహరింతకు గురైన 40 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, వారిని త్వరలోనే విడిపించి, సురక్షితంగా భారత్ చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కిడ్నాపైన భారతీయుల్లో అధికులు పంజాబ్ కు చెందినవారు. వీరంతా ఓ టర్కిష్ కంపెనీలో కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మోసుల్ పట్టణంపై ఐఎస్ఐఎల్ తీవ్రవాదుల దాడుల సందర్భంగా భారత కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ మార్గమధ్యంలోనే వీరిని తీవ్రవాదులు అపహరించారు.

  • Loading...

More Telugu News