: మంచి వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టినందుకు బాబుకు ధన్యవాదాలు: కేఈ


ఏపీ తొలి శాసనసభ స్పీకర్ గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. వైద్య వృత్తిలో ఉన్న కోడెలను దివంగత ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని... అప్పటి నుంచి ఆయన పార్టీకి చేసిన సేవలు అన్నీఇన్నీ కావని కొనియాడారు. ఎంతో రాజకీయానుభవం ఉన్న కోడెల... సభకు మరింత వన్నె తీసుకొస్తారని చెప్పారు. తమ నాయకుడు చంద్రబాబు ఓ మంచి వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. ఈ రోజు శాసనసభలో మాట్లాడుతూ కేఈ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News