: స్పీకర్ గా కోడెల చరిత్రలో మిగిలిపోవాలి: చంద్రబాబు


ఏపీ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన కోడెలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కోడెలకు ఏ పని అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఎంతో మంది స్పీకర్లుగా వచ్చారని... కానీ, కొంతమందే చరిత్రలో మిగిలిపోయారని చెప్పారు. కోడెల కూడా సభను అద్భుతంగా నడిపి చరిత్రలో మిగిలిపోవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా కోడెల పేరుగాంచారని చెప్పారు. హైదరాబాదులో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి కూడా కోడెల ఎంతో కృషి చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News