: స్పీకర్ గా కోడెల ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ప్రోటెం స్పీకర్ నారాయణస్వామి నాయుడు స్పీకర్ గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. దీంతో సభ్యులు కరతాళధ్వనులతో కోడెలను అభినందించారు.