: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఇవాళ ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈరోజు సభలో సభ్యులచే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దివంగత సభ్యులు తంగిరాల ప్రభాకర్, శోభానాగిరెడ్డికి నివాళులర్పిస్తూ సంతాప తీర్మానం చేశారు. సభ తిరిగి రేపు (శుక్రవారం) ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది.