: డాక్టర్ కొడుక్కి జేఈఈ (అడ్వాన్స్ డ్) పరీక్షలో 20వ ర్యాంక్ వచ్చింది
ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు కుమారుడు మల్లెల సాయి అరవింద్ ఇవాళ విడుదలైన ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్ డ్) పరీక్షలో అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంక్ సాధించాడు. అరవింద్ ని అతను కోరుకున్న రంగంలో రాణించేలా ప్రోత్సహించామని డాక్టర్ రావు చెప్పారు. తమ కుటుంబంలో 33 మంది డాక్టర్లు ఉన్నారని, ఇప్పుడు తమ కుమారుడు ఇంజినీరింగ్ వైపు వెళ్లడం ఆనందంగా ఉందని అరవింద్ తల్లి డాక్టర్ మాధవి చెప్పారు.