: శంషాబాద్ ఎయిర్ పోర్టులోని షాపులపై తూనికలు, కొలతల శాఖ దాడులు
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలోని షాపులపై ఇవాళ తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నై సిల్క్స్ దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు... ఆ దుకాణంపై నాలుగు కేసులు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడినందుకు గాను రూ.23 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సరుకుల ధరలు, తయారీ వివరాలు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు.