: తంగిరాల మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం


కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. తంగిరాల ప్రభాకర్ దళిత నాయకుడుగా అంచలంచెలుగా ఎదిగి, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చంద్రబాబు అన్నారు. ఆయన మండలాధ్యక్షుడుగా, జెడ్పీటీసీగా పనిచేసిన అనంతరం శాసనసభ్యునిగా ఎన్నికయ్యారన్నారు. తంగిరాల మృతితో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని బాబు అన్నారు. సభలో దేవినేని ఉమ మాట్లాడుతూ... తంగిరాల మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఆయన రైతు పక్షపాతి అని, లాయర్ గా కూడా ఎంతోమందికి సాయం చేశారని ఉమ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు తంగిరాల ప్రభాకర్ ఎంతో సేవ చేశారని కోడెల శివప్రసాదరావు అన్నారు. తంగిరాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని వైఎస్సార్సీపీ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News