: ప్రేమంటావా... అంటూ కుమార్తె గొంతు కోసిన తండ్రి


కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని గుమ్మనూరులో దారుణం చోటు చేసుకుంది. పెళ్లీడుకొచ్చిన కుమార్తెకు సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులతో, తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని కుమార్తె వెల్లడించింది. అదుపాజ్ఞలలో ఉండాల్సిన కుమార్తె తన నిర్ణయం చెప్పడంతో, ఆగ్రహానికి గురైన తండ్రి ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News