: ప్రమాదం అంచున ఉన్నాం: ఒమర్ అబ్దుల్లా
ఇరాక్ సంక్షోభం రోజురోజుకి ముదురుతోందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, ఇరాక్ లో సంక్షోభం ముదిరితే ఆ ప్రభావం భారత దేశంపై పడుతుందని అన్నారు. మిత్రదేశమైన ఇరాక్ సంక్షోభంతో చమురుధరలు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఒకవేళ అదే జరిగితే నిత్యావసర ధరలు చుక్కలనంటుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
దానికంటే తీవ్రంగా వేధించే సమస్య ఏంటంటే, పది వేల మంది వరకు భారతీయులు ఇరాక్ లో ఉండడమని ఆయన చెప్పారు. ఇరాక్ లో ఉన్న భారతీయులకు ఎలాంటి హాని వాటిల్లకుండా కేంద్రం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడ్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానదేనని ఆయన హామీ ఇచ్చారు.