: ఎన్డీఎంఏ ఉపాధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పేసిన మర్రి శశిధర్ రెడ్డి
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్ష పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఎన్డీఎంఏ సభ్యులను రాజీనామా చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ కోరిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. తాను 2005 నుంచి ఐదు సంవత్సరాలు ఎన్డీఎంఏ సభ్యుడిగా, 2010 డిసెంబరు నుంచి ఉపాధ్యక్షుడుగా పనిచేసినట్లు చెప్పారు.