: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.2 లక్షలకు పైగా విరాళాలు
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.2.85 లక్షల విరాళాలను లోకేష్ కు అందజేశారు. నోవా సంస్థల అధినేత కృష్ణారావు లక్ష రూపాయలు, పర్చూరు నియోజకవర్గానికి చెందిన చక్రపాణి లక్ష రూపాయలు, అమెరికాకు చెందిన ఎన్నారై టి.రేష్మి 1000 డాలర్లు, కె.శివన్నారాయణ రూ.25 వేలు... చెక్కుల రూపంలో లోకేష్ కు అందించారు.