: వరుణుడి ప్రతాపం... ఓవర్ల కుదింపు


భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మిర్పూర్లో జరుగుతున్న చివరి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 8.3 ఓవర్లలో భారత్ స్కోరు 13/3 వద్ద వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆరంభమైనా మరోసారి వానదేవుడు ప్రత్యక్షమవడంతో 12.3 ఓవర్ల వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 4 వికెట్లకు 34 పరుగులు. రైనా (15 బ్యాటింగ్), పుజారా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, వర్షం నిలిచిపోయిన తర్వాత మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఓవర్లను 40కి కుదించారు.

  • Loading...

More Telugu News