: బియాస్ నదిలో ఇవాళ మూడు మృతదేహాలు లభ్యం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ సహాయక బృందాలు మూడు మృతదేహాలను వెలికితీశాయి. మృతులు మాచర్ల అఖిల్, ఆశిష్ మంత, శివప్రసాద్ వర్మగా గుర్తించారు. దీంతో, ఇప్పటివరకు 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 12 మంది మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.