: భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్'
భారత్ సంతతి వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ రాజారామ్ ను ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ఫుడ్' ప్రైజ్ వరించింది. గోధుమ అధికోత్పత్తికి ఉపయోగపడే మేలుజాతి వంగడాల సృష్టిలో రాజారామ్ భాగస్వామ్యానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. మొత్తం 480కి పైగా గోధుమ విత్తనాల రకాలను రాజారామ్ రూపొందించారు. రాజారామ్ కార్యసాధన తమకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వ కార్యదర్శి జాన్ కెర్రీ కొనియాడారు.