: టీమిండియా పతనానికి వరుణుడి బ్రేక్


మిర్పూర్ లో బంగ్లాదేశ్ తో చివరి వన్డేలో భారత్ టాపార్డర్ తడబాటుకు గురైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వరుణుడు రంగప్రవేశం చేయడంతో మ్యాచ్ 8.3 ఓవర్ల వద్ద నిలిచిపోయింది. ఓపెనర్లు ఊతప్ప (5), రహానే (3), రాయుడు (1) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో పుజారా (3 బ్యాటింగ్), తివారీ (0 బ్యాటింగ్) ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తజా, హుస్సేన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News